ETV Bharat / city

ముఖ్యమంత్రి జగన్​కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ - ఎంపీ రఘురామకృష్ణరాజు వార్తలు

ఏటా పెంచుతామన్న పింఛన్లను వైఎస్​ జయంతి నుంచి అమలు చేయాలని కోరుతూ సీఎం జగన్​కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. వయోపరిమితి తగ్గిస్తూ ఇచ్చిన జీవోను 2019 జులై నుంచే అమలు చేయాలని కోరారు.

mp raghu rama krishnam raju
mp raghu rama krishnam raju
author img

By

Published : Jul 5, 2020, 4:42 PM IST

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సీఎం జగన్‌కు లేఖ రాశారు. వృద్ధాప్య పింఛన్ వయోపరిమితి 65 నుంచి 60కి తగ్గిస్తూ గతేడాది జీవో ఇచ్చారని తెలిపారు. 2019 జులై నుంచి జీవోను అమలు చేస్తామని చెప్పారని.. కానీ ఆ జీవోను ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అమలుచేస్తున్నారని గుర్తు చేశారు.

mp raghu rama krishnam raju
సీఎంకు జగన్​కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ

దీనివల్ల ఒక్కో లబ్ధిదారు 7 నెలలకు రూ.15,750 నష్టపోయారని పేర్కొన్నారు. అర్హులకు ఆ మొత్తం అందేలా అధికారులను ఆదేశించాలని లేఖలో ప్రస్తావించారు. ఏటా పెంచుతామన్న రూ.250ను వైఎస్‌ జయంతి నుంచి అమలు చేయాలని కోరారు. ప్రస్తుత పింఛను మొత్తాన్ని రూ.2,500కు పెంచాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

ఏ దరికి చేరునో.. రఘురామరాజకీయం..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.