రాష్ట్ర ప్రభుత్వంపై ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు చేశారు. ఉచిత పథకాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి చేరిందని ఆరోపించారు. పింఛనుదారులకూ ఎదురుచూపులు తప్పడం లేదని విచారం వ్యక్తం చేశారు.
"సీఎం జగన్ ప్రభుత్వ సొమ్మును పప్పుబెల్లాలుగా పంచిపెడుతున్నారు. జీతాలు - ఉచితాలు ఏవి ముఖ్యమో ప్రజలు గమనించాలి. రాష్ట్రం ఆర్థికంగా కుప్పకూలే పరిస్థితి ఎంతో దూరంలో లేదు. గుత్తేదారులకు లక్ష కోట్లు రూపాయలు చెల్లించాల్సి ఉంది. వారిని ఆదుకోవాలి" - రఘురామకృష్ణం రాజు, ఎంపీ
ఇదీ చదవండి: