ఇదీ చదవండి:
రైతులు చర్చలకు రాకుండా తెదేపా అడ్డుకుంటోంది: నందిగం సురేష్ - three capitals for AP news
ప్రభుత్వంతో రైతులు చర్చలకు రాకుండా తెదేపా నేతలు అడ్డుకుంటున్నారని వైకాపా ఎంపీ నందిగం సురేశ్ ఆరోపించారు. త్వరలోనే రాజధాని రైతుల సమస్యలను పరిష్కరిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
MP nandigama suresh comments on chandrababu
అమరావతి రైతులు చర్చలకు రాకుండా... తెదేపా అధినేత చంద్రబాబే అడ్డుపడుతున్నారని వైకాపా ఎంపీ నందిగం సురేశ్ ఆరోపించారు. ప్రభుత్వం తరఫున ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు చర్చలకు పంపగా... అక్కడున్న తెదేపా నేతలు అన్నదాతలను అడ్డుకున్నారని చెప్పారు. కొద్ది రోజుల్లోనే రైతుల సమస్యలను పరిష్కరించి.. వారికి అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు. తనపై టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు దాడి చేయాలని చూశారన్న సురేశ్.. భవిష్యత్‌లో తనకు ఏం జరిగినా చంద్రబాబు, లోకేశ్‌దే బాధ్యతని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: