ETV Bharat / city

వాడరేవు వివాదం త్వరలోనే సమసిపోతుంది: మోపిదేవి

author img

By

Published : Dec 15, 2020, 4:19 PM IST

ప్రకాశం జిల్లా చీరాలలో మత్స్యకారుల మధ్య తలెత్తిన వివాదం త్వరలోనే సమసిపోతుందని ఎంపీ మోపిదేవి వెంకటరమణరావు తెలిపారు. గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పామని చెప్పారు. ఘటనలో బయటి వ్యక్తుల ప్రమేయం ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

mp mopidevi venkata ramana rao
mp mopidevi venkata ramana rao

ప్రకాశం జిల్లాలోని రెండు మత్స్యకార గ్రామాల మద్య తలెత్తిన వివాదం త్వరలోనే సమసిపోతుందని ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు అభిప్రాయపడ్డారు. రెండు మత్స్యకార గ్రామాల పెద్దలతో చర్చిస్తున్నామని.. రెండు గ్రామాల మధ్య శాంతియుత వాతావరణం ఇప్పటికే ఏర్పరిచామని మోపిదేవి గుర్తు చేశారు. చిన్నకన్ను వలతో వేట నిషేధం ఎప్పటినుంచో అమల్లో ఉందన్న ఆయన... సమస్య చిన్నదైనప్పటికీ ప్రజల మధ్య అపోహలు, అపార్థాలు తలెత్తాయన్నారు.

వివాదం వెనక బయటి వ్యక్తుల పాత్రపై పోలీసులు విచారణ జరుపుతున్నారని వెల్లడించారు. బయటి వ్యక్తుల ప్రమేయం ఉంటే చట్టపరంగా చర్యలు తప్పవని ఎంపీ మోపిదేవి హెచ్చరించారు.

ఇదీ చదవండి

రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఎన్జీటీలో పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.