తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పినట్లుగానే నరసాపురం ఎంపీ రఘురామ పనిచేస్తున్నారని వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి ఆరోపించారు. ఎంపీకి దెబ్బలు తగల్లేదని వైద్యులు నివేదిక ఇచ్చారని గుర్తు చేశారు. బెయిల్ రాలేదని తెలిసే రఘురామ తనను పోలీసులు కొట్టారంటూ కొత్త నాటకానికి తెరతీశారన్నారు. తెదేపా నేతలు అరెస్టైనప్పుడు కూడా చంద్రబాబు రాష్ట్రపతికి లేఖ రాయలేదని చెప్పారు. రఘురామ విషయంలో పెద్ద కుట్రతోనే చంద్రబాబు రాష్ట్రపతికి లేఖ రాసినట్లు మిథున్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోందని అన్నారు. కుట్ర వ్యవహారాలను లోక్‌సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తనున్నట్లు తెలిపారు.
రఘురామ విషయంలో ఏం చేయాలో మాకు తెలుసు: ఎంపీ బాల శౌరి
మిగతా ఎంపీలకు ఇవ్వని ప్రాధాన్యత రఘురామకృష్ణరాజుకు సీఎం జగన్ ఇచ్చారని.. కీలక కమిటీల్లో చోటు కల్పించారని ఎంపీ బాల శౌరి చెప్పారు. డ్రామలను చంద్రబాబు ఇప్పటికైనా ఆపాలన్న ఆయన.. ఏం చేయాలో తమకు తెలుసని.. అన్నింటినీ ఎదుర్కొంటామని వ్యాఖ్యానించారు.
రమేశ్ ఆసుపత్రే ఎందుకు..? ఎయిమ్స్ ఉందిగా: ఎంపీ లావు కృష్ణదేవరాయలు
రఘురామకృష్ణరాజును రమేష్ ఆస్పత్రికే తీసుకెళ్లాలని కోరడాన్ని ఎంపీ లావు కృష్ణదేవరాయలు తప్పుపట్టారు. గుంటూరు నగరంలో అనేక ఆసుపత్రులు ఉన్నాయన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎయిమ్స్ ను ఎందుకు కోరుకోవడం లేదన్నారు. రఘురామ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తుందని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: