ETV Bharat / city

ప్రజల తీర్పును గౌరవిస్తాం: ఎంపీ కేశినేని నాని

మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ రాబోయే రోజుల్లో కచ్చితంగా పుంజుకుంటామని ఎంపీ కేశినేని నాని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

kesineni nani
kesineni nani
author img

By

Published : Mar 14, 2021, 8:18 PM IST

ప్రస్తుత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ రేపు కచ్చితంగా పుంజుకుంటామని తెలుగుదేశం నేతలు ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు నిర్ణయించేది ప్రజలేనని వారి తీర్పును గౌరవిస్తామని విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. ఎన్నికలలో పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు చెప్పారు.

  • ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు నిర్ణయించేది ప్రజలు ప్రజా తీర్పును గౌరవిస్తూ ఈ ఎన్నికలలో తెలుగదేశం కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు🙏🙏🙏

    — Kesineni Nani (@kesineni_nani) March 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఓట్ల శాతం చెక్కుచెదరలేదు: గోరంట్ల

వైకాపా గెలిచింది నిజమే కానీ తెదేపా ఓడిన స్థానాల్లో చాలా తక్కువ మెజారిటీతో ఓడిందని పార్టీ సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. తెదేపా ఓటు షేర్ చెక్కు చెదరలేదనే విషయం మరోసారి నిరూపితం అయిందని చెప్పారు. అధికార అండ, ధన ప్రవాహంతో వచ్చిన తాత్కాలిక విజయం అనే విషయం తెలుసుకోవాలని హితవు పలికారు. ఈ విజయం కృతిమ ఆనందం పొందడానికి మాత్రమే పనికి వస్తుందని ఎద్దేవా చేశారు. అరాచకాలు తట్టుకుని నిలబడ్డ తెదేపా అభిమానులు, కార్యకర్తలు కృషి మరువలేనిదన్నారు.

ఇదీ చదవండి

పుర పోరు: కోటలో తగ్గని వైకాపా జోరు..మరోసారి విజయకేతనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.