ఎస్ఈసీ అంశంలో ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్న జస్టిస్ కనగరాజ్ సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోందని ఎంపీ రఘరామకృష్ణరాజు అన్నారు. ఈ పరిస్థితి చూస్తేంటే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా కొనసాగించే ఆలోచన లేనట్లు అర్థమవుతోందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని ఎంపీ రఘురామకృష్ణరాజు హితవు పలికారు.
కరోనా లెక్కలపైనా అనుమానం
ప్రభుత్వం రోజూ విడుదల చేస్తున్న కరోనా కేసుల సంఖ్యపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో నిన్న 900 కేసులు ఉన్నట్టు ప్రభుత్వం చెప్పిందని... వాస్తవంగా అంతకంటే ఎక్కువ కేసులు ఉన్నట్టు అనిపిస్తోంది అన్నారు. ప్రజలకు జాగ్రత్తలు చెప్పాల్సిన పాలకులే... మాస్క్ల్లేకుండా తిరిగి కరోనా విజృంభణకు కారణమయ్యారని ఆరోపించారు. సీఎం వెయ్యి కోట్లు విడుదల చేయడాన్ని స్వాగతించిన ఆయన... మొదటి నుంచి శ్రమించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని విమర్శించారు.
ఇదీ చదవండి: