రాజధాని పరిధిలో ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై వేసిన సిట్‌కు భయపడే ప్రసక్తే లేదని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. సిట్ కాకపోతే మరిన్ని విచారణ కమిటీలు వేసినా.. తమకు ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు. ప్రభుత్వం వేసిన సిట్ కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమేనని ఆరోపించారు. ప్రభుత్వం చెప్పినట్లు వినే పోలీసులతో ఏర్పాటు చేసిన సిట్ కు విశ్వసనీయత ఉండదని అన్నారు. నిజంగా అవినీతి జరిగి ఉంటే సీబీఐ లాంటి సంస్థతో విచారణ జరిపించుకోవాలని సూచించారు. వెలగపూడిలో 24 గంటల నిరాహారదీక్ష చేపట్టిన మహిళలకు గల్లా మద్దతు తెలిపారు.
సిట్టింగ్ జడ్జితో విచారించండి..
ఐదేళ్ల ప్రభుత్వ పాలనపై సిట్ వేయటం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ మండిపడ్డారు. అక్రమాలు జరిగి ఉంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలీసులతో అయితే ఇష్టానుసారం నివేదిక రాయించుకోవచ్చన్న ఆలోచనతోనే ప్రభుత్వం సిట్ వేసిందని ఆరోపించారు.
ఇదీ చదవండి :