అమెరికాకు చెందిన ఆంఫినాల్ సంస్థ - ఏపీ మెడ్‌టెక్ జోన్ లిమిటెడ్ మధ్య కీలకమైన అవగాహన ఒప్పందం కుదిరింది. అధునాతన వైద్య పరికరాల తయారీ కోసం సుమారు రూ.20 కోట్లకు పైగా పెట్టుబడులకు ఆంఫినాల్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. వెబినార్ ద్వారా రెండు సంస్థలు ఈ ఎంవోయూను కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంతో శాస్త్రవేత్తలు, మెడికల్, ఫార్మా, ఇంజినీరింగ్ నిపుణులకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.
వైద్య పరికరాల తయారీలో 70 ఏళ్ల అపార అనుభవమున్న ఆంఫినాల్.. శరీరంలోని భౌతికమై మార్పులకు సంబంధించిన ఉష్ణోగ్రత, ప్రాణవాయువైన ఆక్సిజన్, హ్యుమిడిటీ, ఒత్తిడి వంటి వాటి స్థాయిలను, కొలిచి, నిర్ధారించే పరికరాల తయారీలో నిమగ్నమై ఉంది. తాజా ఒప్పందంతో ఆంఫినాల్ ఇప్పుడు ఆధునాతన సెన్సర్లు తయారీ చేయనున్నట్టు మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19.. పెను విపత్తులా విజృంభిస్తున్న సమయంలో ఇలాంటి వైద్యపరికరాల తయారీ ఒప్పందాలు ఎంతో అవసరమని మంత్రి స్పష్టం చేశారు. 4 నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, శుభ్రత, మంచి అలవాట్లపై ప్రజలకు శ్రద్ధ పెరిగిందని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వైద్య రంగం, ఫార్మా, పరిశోధనలపై ప్రాముఖ్యత, సముచిత గౌరవాన్ని తీసుకు వచ్చాయని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: