తెలంగాణ రంగారెడ్డి జిల్లా నార్సింగి గంధంగూడలో దారుణం చోటుచేసుకుంది. 12 ఏళ్ల కుమారుడిపై తల్లి విచక్షణరహితంగా దాడిచేసింది. తొడలపై బ్లేడుతో కోసింది. బాలుడు శంకర్ కేకలతో స్థానికులు ఘటనాస్థలికి వెళ్లారు. స్థానికుల రాకతో బాలుడు తల్లి చంద్రకళ పరారైంది. స్థానికులు నార్సింగ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాలుడిని ఆస్పత్రికి తరలించారు. తన మాట వినట్లేదని.. కుమారుడిని గాడిన పెట్టేందుకే తాను గాయపరిచినట్లు ఆమె తెలిపింది.
ఇదీ చూడండి: ఔటర్ రింగ్‌రోడ్‌పై ప్రమాదం.. 25 మందికి గాయాలు