ETV Bharat / city

పోలీస్ స్టేషన్ కు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్.. మేనేజర్ పోస్టు కావాలట! - జాబ్ ఆఫర్

అది 15 ఆగస్టు 2022.. ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు.. ఎదురుగా కూర్చున్న రైటర్ వద్దకు వెళ్లి.. "హాయ్ బ్రో.. " అని పరిచయం చేసుకున్నాడు. "మన స్టేషన్ లో ఉద్యోగం ఉందని ప్రకటన ఇచ్చారు కదా.. నేను దరఖాస్తు చేసుకున్నాను. ఎంత వరకు వచ్చింది?" అని ఆరాతీశాడు. ఇతకీ.. అతను ఎవరంటే.. ఓ క్రిమినల్! మోస్ట్ వాంటెండ్ క్రిమినల్..!! ఏడేళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు..!!

thief
thief
author img

By

Published : Sep 15, 2022, 6:17 PM IST

ఒక నేరాన్ని దాచిపెట్టడానికి.. ఇంకో నేరం చేయాల్సి రావొచ్చు. ఈ రెండూ బయటపడకుండా ఉండడానికి.. మరికొన్ని ఘోరాలు చేయాల్సి రావొచ్చు.. కానీ, వీటిని పోలీసు డాగ్స్ వాసన పట్టాయంటే మాత్రం ఖతమే..! మరి, ఇలా జరక్కుండా ఉండాలంటే ఏం చేయాలబ్బా.. అని ఆలోచించాడు. క్రిమినల్ బుర్రతో ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. ఇంట్లోని దొంగను.. ఇంటర్ పోల్ డిపార్ట్ మెంట్ కూడా పట్టుకోలేదు కదా అనుకున్నాడు. వెంటనే పోలీసు స్టేషన్ లో ఉద్యోగానికి అప్లై చేసుకున్నాడు. అతనే దక్షిణాఫ్రికాకు చెందిన "నగ్ కోబో".

ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే.. 2015లో ఓ హార్డ్ వేర్ ప్రొడక్ట్స్ విక్రయించే సంస్థలో.. డెలివరీ మ్యాన్‌గా పని చేశాడు నగ్ కోబో. అతను పక్కాగా డ్యూటీ చేసేవాడు. అనుకున్న టైమ్ కే డెలివరీ చేసేవాడు. కానీ.. కరెక్ట్ చిరునామాకు కాదు.. రాంగ్ అడ్రస్ కు! అవును.. సంస్థ నుంచి డెలివరీకి తీసుకెళ్లే వస్తువులను తానే కొట్టేసేవాడు. ఇందుకోసం.. ముందుగానే నకిలీ ఇన్ వాయిస్ లు తయారు చేసేవాడు. ఆ ఇన్ వాయిస్ లు డెలివరీ డిపార్ట్ మెంట్లో చూపించి.. కాస్ట్ లీ వస్తువులను దర్జాగా బయటకు తీసుకెళ్లి అమ్ముకొని జల్సాలు చేసుకునేవాడు.

నష్టం చాలా జరిగిపోయిన తర్వాత కంపెనీ యాజమాన్యం మేల్కున్నది. నకిలీ ఇన్ వాయిస్ ల బాగోతాన్ని గుర్తించి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ.. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన నిందితుడు.. అప్పటికే జంప్! అప్పటి నుంచి గడిచిన ఏడు సంవత్సరాలుగా పరారీలో ఉన్నాడు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. పోలీసులు.. "నగ్ కోబో"ను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లిస్టులో చేర్చారు. అతని కోసం గాలిస్తూనే ఉన్నారు గానీ.. జాడలేదు.

ఏడేళ్ల తర్వాత.. సౌతాఫ్రికాలోని మ్పుమలంగా ప్రావిన్స్ పోలీసు స్టేషన్ లో ప్రత్యక్షమయ్యాడు. బుద్ధిమంతుడైన పట్టభద్రుడిలా.. టై వేసుకొని, టక్ చేసుకొని వెళ్లి.. అక్కడ సాగుతున్న పోలీస్ రిక్రూట్ మెంట్లో ఆఫీస్ పర్పస్ జాబ్ కు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ.. ఇతన్ని ఎవ్వరూ గుర్తించలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు.. అప్లికేషన్ కు రిప్లే ఏమీ రాలేదంటూ.. మరోసారి పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తనకు ఉద్యోగం ఎందుకు రాలేదంటూ.. ఆరా తీశాడు? ఆ సమయంలో కంప్యూటర్ లో వెరిఫై చేస్తుండగా.. ఇతగాడి జాతకం మొత్తం బయటపడింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. తెలుగు సినిమా క్లైమాక్స్ డైలాగ్ ఒకటి వదిలారు.. "యువర్ అండర్ అరెస్ట్" అని! అదిసరే.. ఫర్ సఫోజ్.. నిందితుడు ఈ ఒక్క స్టెప్ దాటేస్తే.. ఫ్యూచర్ ఎలా ఉండేదో..?!!!

వీటిపైనా ఓ క్లిక్కేయండి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.