YSR NAMES IN AP : రాష్ట్రంలో ప్రజాధనంతో అమలవుతున్న దాదాపు 75కు పైగా పథకాలు, కార్యక్రమాలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. తన పేరు లేదా తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి పేరు పెట్టుకున్నారు. వీటిల్లో ఎక్కువ శాతం పథకాలు, కార్యక్రమాలు గత ప్రభుత్వాల హయాంలో అమలైనవే. జగన్ అధికారంలోకి వచ్చాక పాతవాటి పేర్లు మార్చేసి తన పేరో, తండ్రి పేరో తగిలించుకోవటం మొదలుపెట్టారు. కొత్తవాటికైతే సరేసరి! దేశంలోనే కాదు.. బహుశా ప్రపంచంలోనే మరెక్కడా ఇంత భారీ ఎత్తున పథకాలకు సొంత పేర్లు పెట్టుకోవటం ఉండదేమో.
గతంలోనూ కొన్ని ప్రభుత్వాలు కొన్ని కార్యక్రమాలకు తమ పార్టీ నేతలు లేదా స్వాతంత్య్ర సమరయోధులు, లబ్ధ ప్రతిష్ఠుల పేర్లు పెట్టుకునే సంప్రదాయం ఉంది. కానీ జగన్ మాత్రం దీన్ని ఒక ఉద్యమంలా కొనసాగిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో 75కు పైగా పథకాలకు జగనన్న, వైఎస్‌ఆర్ అనే పేర్లు పెట్టారు. పస్తుతం రాష్ట్రంలో జగనన్న పేరుతో 20కి పైగా, రాజశేఖర్‌రెడ్డి పేరుతో 55కు పైగా పథకాలు, కార్యక్రమాలు ఉన్నాయి. ఇవి కాకుండా జిల్లాలు, మండలాల్లో అయితే వందలాది భవనాలు, ప్రాంతాలు, ఉద్యానవనాలు, మైదానాలు, రోడ్లకు రాజశేఖర్‌రెడ్డి పేర్లు ఉన్నాయి.
ఇవీ చదవండి: