ETV Bharat / city

నేటి నుంచి పూర్తిస్థాయిలో రోడ్డెక్కుతున్న ప్రైవేటు బస్సులు

ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు నేటి నుంచి పూర్తిస్థాయిలో రోడ్డెక్కనున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి, ఒక్క హైదరాబాద్​కే సుమారు 800 సర్వీసులు సిద్ధమవుతున్నాయి. బస్సుల నిర్వహణ సహా ప్రయాణంలో కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని అధికారులు ఆదేశించారు. అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు

రోడ్డెక్కుతున్న ప్రైవేట్​ బస్సులు
రోడ్డెక్కుతున్న ప్రైవేట్​ బస్సులు
author img

By

Published : Oct 1, 2020, 6:01 AM IST

Updated : Oct 1, 2020, 6:11 AM IST

నేటి నుంచి పూర్తిస్థాయిలో రోడ్డెక్కుతున్న ప్రైవేటు బస్సులు

అన్‌లాక్ ప్రక్రియ తొలిదశలో ఆర్టీసీ బస్సులకు పచ్చజెండా ఊపిన ప్రభుత్వం, అప్పట్లోనే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకూ అనుమతి ఇచ్చింది. త్రైమాసిక పన్ను చెల్లించాల్సి వస్తుందన్న భావనతో, ట్రావెల్స్ యాజమాన్యాలు వెనకడుగు వేశాయి. ప్రజల అవసరాల దృష్ట్యా సెప్టెంబర్‌కు మాత్రమే పన్ను చెల్లించే వెసులుబాటు కల్పించడంతో, నెల నుంచి కొన్ని ట్రావెల్స్ బస్సులు నడుపుతున్నాయి. డిమాండ్ అధికంగా ఉండే హైదరాబాద్‌ మార్గంలో, సెప్టెంబర్ 2 నుంచి 50 బస్సులతో రాకపోకలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 300 బస్సులు తిరుగుతుండగా నేటి నుంచి ఆ సంఖ్య 800కు పెరగనుంది. పండుగ సీజన్ సమీపిస్తున్నందున, హైదరాబాద్ సహా ఇతర రాష్ట్రాల్లోని ముఖ్య నగరాలకూ, బస్సులు బయలుదేరనున్నాయి. ఇందుకు అనుగుణంగా ట్రావెల్స్ యాజమానులు అక్టోబర్ నుంచి డిసెంబర్‌ వరకు త్రైమాసిక పన్ను చెల్లించారు.

పెద్ద సంఖ్యలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు రోడ్డెక్కుతున్నందున కరోనా నిబంధనలు పాటించాల్సిందేనని రవాణాశాఖ స్పష్టం చేసింది. ఒక్కో బస్సులో, 50 శాతం సీట్లు నింపాలని నిర్దేశించింది. బస్సులను రోజుకు 2 సార్లు శానిటైజ్ చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రయాణికులకూ శానిటైజర్‌ అందుబాటులో ఉంచాలన్నారు.

టికెట్ బుకింగ్‌లపైనా నిఘా పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. అధిక ఛార్జీలు వసూలు చేసేవారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి : 'పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యం'

Last Updated : Oct 1, 2020, 6:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.