కరోనా వైరస్ వ్యాప్తికి వైకాపా నేతలు బ్రాండ్ అంబాసిడర్‌లా మారారని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు ఆరోపించారు. కోవిడ్ నివారణకు చిన్నారులు సైతం ఇళ్లల్లోంచి బయటకు రాకుండా సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తుంటే... వైకాపా నేతలు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం రోడ్లపై తిరుగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న విశాఖలో విజయసాయిరెడ్డి సామాజిక దూరం పాటించకుండా సరకులు ఎలా పంపిణీ చేశారని నిలదీశారు. అల్లపురంలో ఇతర పార్టీలకు చెందిన వారిని వైకాపాలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. ప్రపంచమంతా కరోనా నివారణపై దృష్టి పెడితే వైకాపా నేతలు మాత్రం స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను గాలికొదిలి పార్టీ ప్రయోజనాల కోసం ప్రాకులాడుతున్న ఏకైక ముఖ్యమంత్రి...జగన్ అని మంతెన విమర్శించారు.
ఇదీ చదవండి: వెళ్లలేరు.. ఉండలేరు..