వైకాపా ప్రభుత్వం రెండేళ్లలో 15 లక్షలు ఉద్యోగాలు కల్పించినట్లు బూటకపు ప్రచారానికి పూనుకుందని ఎమ్మెల్సీ అశోక్బాబు విమర్శించారు. అన్ని ఉద్యోగాలు కల్పిస్తే నిరుద్యోగులు రోడ్లపైకి ఎందుకు వస్తారని ప్రశ్నించారు. రేషన్ వాహనాల డ్రైవర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా కలిపి చూపించడం సిగ్గుచేటని విమర్శించారు. ఉద్యోగులకు ఇచ్చిన హమీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆయన.. ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పనకు ఏం చర్యలు చేపట్టారో చెప్పుకోలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ల కొరతపై హైకోర్టు విచారణ... కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తి