గురువారం ఉద్యోగులతో చర్చల్లో.. సీఎం మాటలు నమ్మలేని విధంగా ఉన్నాయని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ఫిట్ మెంట్ ఇచ్చినపుడు ఆర్థికభారం ఎంతపడుతుందో తెలియదా? అని ప్రశ్నించారు. ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారంలో ఏపీని తెలంగాణతో పోల్చడం సరికాదన్నారు. చర్చలకు వెళ్లిన ఉద్యోగ సంఘాలు.. ఏది చెబితే అది విని పరపతి, హోదా దిగజార్చుకున్నాయని వ్యాఖ్యానించారు.
'ఐఆర్ కంటే ఫిట్‌మెంట్ ఎక్కువ ఇవ్వాలని తెలియదా? ఫిట్‌మెంట్ ఇచ్చినపుడు ఆర్థికభారం ఎంతపడుతుందో తెలియదా? ప్రభుత్వానికి ఆదాయం బాగానే వస్తోంది. తెలంగాణ కంటే రూ.35 వేల కోట్లు ఎక్కువగా వచ్చాయి. రాష్ట్రం ఆశించిన దానికంటే ఎక్కువగా కేంద్ర నిధులు వచ్చాయి. ఉద్యోగులు అనేసరికి ఆర్థికపరిస్థితి బాగోలేదని అంటున్నారు. రాజకీయ అవసరాల కోసం కొత్త వ్యవస్థలను తీసుకొచ్చారు. మూడు కొత్త వ్యవస్థల వల్ల ఏటా రూ.6,200 కోట్ల భారం పడుతోంది. కొత్త వ్యవస్థలకు.. ప్రస్తుత ఉద్యోగులకు సంబంధం లేదు. కొత్త వ్యవస్థల సిబ్బందికి జీతాలు ఇవ్వవద్దని చెప్పట్లేదు. ఆర్థిక ఇబ్బందులు ఆలోచించి విధాన నిర్ణయాలు తీసుకోవాలి. ఖర్చు పెరుగుతోందని జీతాలు ఇవ్వలేమనడం వంచనే.' - తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు
ఇదీ చదవండి: