ETV Bharat / city

వివాహిత గొంతు కోసి పరారైన ఎమ్మెల్యే పీఏ - MLA Gopinath PA attack with knife on married woman

MLA Gopinath PA attacked a woman : తెలంగాణ జూబ్లీహిల్స్​ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్​ పీఏ ఓ వివాహితపై దాడి చేశాడు. కత్తితో ఆమె గొంతుకోశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

PA
PA
author img

By

Published : Sep 19, 2022, 12:46 PM IST

MLA Gopinath PA attacked a woman: హైదరాబాద్​ పంజాగుట్ట పోలీస్​స్టేషన్​ పరిధిలో జూబ్లీహిల్స్​ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్​ పీఏ విజయ్..​ అర్ధరాత్రి వీరంగం సృష్టించాడు. కత్తితో ఓ వివాహిత గొంతు కోశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. గమనించిన కుటుంబసభ్యులు బాధితురాలిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఓ ప్రైవేట్​ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది కావడంతో పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు.. ఈ విషయంపై ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్​ను వివరణ కోరగా.. విజయ్​ తన పీఏ కాదని.. గతంలో ఓ కార్పొరేటర్ వద్ద పని చేశాడని చెప్పడం గమనార్హం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.