ETV Bharat / city

MLA JAGGAREDDY: కాంగ్రెస్‌ను వీడనున్న జగ్గారెడ్డి..!

MLA JAGGAREDDY: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్​ను వీడనున్నారు. పార్టీకి, పార్టీ పదవికి శనివారం రాజీనామా చేయనున్నారు. ‘నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా పార్టీలో కొందరు కుట్రలు చేశారు. నేను పార్టీ కోసం ఎంతగానో పనిచేసినా అవమానించారు. తట్టుకోలేకే పార్టీని వీడాలని నిర్ణయం తీసుకుంటున్నా’ అని జగ్గారెడ్డి ‘ఈనాడు’కు వివరించారు.

JAGGAREDDY
JAGGAREDDY
author img

By

Published : Feb 19, 2022, 12:46 PM IST

MLA JAGGAREDDY: కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. పార్టీకి, పార్టీ పదవికి శనివారం రాజీనామా చేయనున్నారు. సంగారెడ్డి జిల్లా ముత్తంగిలో శుక్రవారం ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ నుంచి వెళ్లిపోయేందుకు దారితీసిన పరిస్థితులు, ఇటీవల జరిగిన పరిణామాలన్నింటినీ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రూపంలో అందించాలని నిర్ణయించినట్లు సమాచారం. ‘నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా పార్టీలో కొందరు కుట్రలు చేశారు. నేను పార్టీ కోసం ఎంతగానో పనిచేసినా అవమానించారు. తట్టుకోలేకే పార్టీని వీడాలని నిర్ణయం తీసుకుంటున్నా’ అని జగ్గారెడ్డి ‘ఈనాడు’కు వివరించారు. శనివారం రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి సమర్పిస్తానన్నారు.

ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి 2018లో కాంగ్రెస్‌ తరఫున ఆయన ఒక్కరే గెలుపొందారు. 2004లో తెరాస నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయిన జగ్గారెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి 2009, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. 2014లో తెరాస అభ్యర్థి చింతా ప్రభాకర్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్‌రెడ్డికి ఇవ్వడాన్ని మొదటి నుంచి వ్యతిరేకించారు. రేవంత్‌రెడ్డి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాతా.. పలు అంశాల్లో ఆయనతో విభేదించారు. దీంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో జగ్గారెడ్డి కొంతకాలంగా సీఎం కేసీఆర్‌తో పాటు తెరాస నేతలపైనా దూకుడు తగ్గించారు. తాజాగా కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధమయ్యారు.

తెరాసలో చేరతారా?

ఇటీవల తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సంగారెడ్డికి వచ్చిన సందర్భంగా ఆయనకు, జగ్గారెడ్డికి మధ్య సాగిన సంభాషణలు అందరిలోనూ ఆసక్తి రేపాయి. మా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను మీరే జాగ్రత్తగా చూసుకోవాలని జగ్గారెడ్డితో కేటీఆర్‌ అనడంతో... రానున్న రోజుల్లో ఆయన తెరాసలో చేరతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. జగ్గారెడ్డి మాత్రం తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని పలుమార్లు స్పష్టం చేశారు. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయంతో ప్రస్తుతం ఏ పార్టీలో చేరతారనే చర్చ నడుస్తోంది. ఇతర పార్టీల్లో చేరే ఆలోచన లేదని, స్వతంత్రంగానే ఉంటానని జగ్గారెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి: 'పార్టీ లైన్​ దాటిన రేవంత్​రెడ్డి​ క్రమశిక్షణ పరిధిలోకి రాడా..?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.