కర్నూలు శాసన సభ్యుడు హఫీజ్ ఖాన్ను మధ్య ప్రాచ్యదేశాలకు రాష్ట్రం తరపున సహాయ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఇప్పటికే పనిచేస్తున్న జుల్ఫీకి సహాయంగా హఫీజ్ఖాన్ను నియమిస్తున్నట్టు పేర్కొంది.
మధ్య ప్రాచ్యదేశాల్లోని వ్యాపార వాణిజ్య అవకాశాలు, పెట్టుబడులను ఏపీకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఆయా దేశాల్లోని వాణిజ్య వేత్తలు, బ్యూరో తదితరులతో సమావేశమై.. ఏపీకి పెట్టుబడులు రాబట్టడంలో ఏపీ ప్రత్యేక ప్రతినిధులు ప్రయత్నిస్తారని వెల్లడించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు ఇచ్చారు.
ఇదీ చదవండి : కశ్మీర్లో ఎన్కౌంటర్- ముష్కరుడు హతం