తెలంగాణ(Telangana)లో భూముల రిజిస్ట్రేషన్(Land registration) విలువలను పెంచాలని.. మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూముల విలువల సవరణకు ప్రతిపాదనలు పంపింది. వెంటనే సవరణ చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రివర్గ ఉపసంఘం పేర్కొంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నాటి నుంచి రిజిస్ట్రేషన్ విలువల్లో సర్కారు ఎటువంటి మార్పులు చేయలేదు.
ఏపీలో 8 ఏళ్లల్లో 7 సార్లు రిజిస్ట్రేషన్ విలువలు పెరిగిందని మంత్రవర్గ ఉపసంఘం పేర్కొంది. ప్రభుత్వ విలువల కన్నా ఎక్కువకే లక్షలాది రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని నివేదించింది. హెచ్ఎండీఏ పరిధిలో అధిక విలువతో 51 శాతం రిజిస్ట్రేషన్లు జరిగినట్లు పేర్కొంది.
తక్కువ రిజిస్ట్రేషన్ విలువతో రుణాలు తీసుకొనేందుకు ఇబ్బందులు కలుగుతున్నట్లు మంత్రి ఉపసంఘం.. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. ప్రాజెక్టులు, వ్యవసాయాభివృద్ధితో గ్రామాల్లోనూ భూముల విలువ అధికంగా ఉందని వెల్లడించింది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి విలువ భారీగా పెరిగిందని మంత్రివర్గ ఉపసంఘం పేర్కొంది.
ఇదీచూడండి: