తెలంగాణలోని భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్ హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. నిత్యకల్యాణ మండపంలో అత్యంత నిరాడంబరంగా రామయ్య కల్యాణం జరుగుతోంది. కరోనా ప్రభావంతో కేవలం 40 మంది ముఖ్యులు, వైదిక పెద్దలు, అర్చకుల సమక్షంలో వేడుకలు జరుగుతున్నాయి.
ఇవీ చూడండి: