దేశంలో ఏ నగరంలో లేని విధంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇందుకు రాష్ట్రంలో శాంతిభద్రతలతో కూడిన మెరుగైన పాలన, దీర్ఘదృష్టి విధానాలే కారణమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ హైటెక్స్ ఎగ్బిషన్ హాలులో ఏర్పాటుచేసిన పదో ఎడిషన్ క్రెడాయ్ ప్రాపర్టీషోను మంత్రి ప్రారంభించారు.
హైదరాబాద్‌కు రీజనల్ రింగ్‌రోడ్డు రానుంది. అందుకు సంబంధించి పరిశీలనలు జరుగుతున్నాయి. వలయ రహదారితో హైదరాబాద్ స్థిరాస్తి రంగానికి ఆకాశమే హద్దు. చౌక ధరల్లో ప్లాట్లు దొరుకుతాయి. ప్రజలకు మంచి అవకాశాలు కలుగుతాయి. -వేముల ప్రశాంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి
మూడు రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనలో 15 వేలకు పైగా ప్రాపర్టీలను వినియోగదారులు ఎంపిక చేసుకునే వీలుంది. కొవిడ్ నేపథ్యంలో గతేడాది క్రెడాయ్ ప్రాపర్టీ షోకు బ్రేక్ పడగా.. ఈసారి స్టాళ్లను సైతం వందకే పరిమితం చేశారు. నగరానికి త్వరలో అందుబాటులోకి రానున్న రీజనల్ రింగ్ రోడ్డు ద్వారా హైదరాబాద్ స్థిరాస్థి రంగం మరింత ఊపందుకుంటుందని మంత్రి వేముల ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: