ETV Bharat / city

'బండి సంజయ్... మీ తెలంగాణలో చూసుకో, ఇక్కడ అవసరం లేదు' - బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి వెల్లంపల్లి కౌంటర్

భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై... మంత్రి వెల్లంపల్లి స్పందించారు. ఏపీలో అంతా బాగానే ఉందని.. ఏమైనా ఉంటే.. తెలంగాణలో చూసుకోవాలని బదులిచ్చారు. విజయవాడలో మాట్లాడిన మంత్రి.. ఆలయాలపై రాజకీయాలు జరగటం దురదృష్టకరమన్నారు.

minister vellampalli
minister vellampalli
author img

By

Published : Jan 5, 2021, 4:32 PM IST

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

రామతీర్థంలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టాలని చూస్తే ఊరుకోబోమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. మతాలంటే ఇష్టమెుచ్చినట్లు మాట్లాడే పవన్ కల్యాణ్​తో భాజపా ఎప్పుడైతే పొత్తు పెట్టుకుందో.. నాటి నుంచే తమకు వారిపై గౌరవం పోయిందన్నారు. విజయవాడ టు టౌన్​లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... తెదేపా హయాంలో మంత్రి మాణిక్యాలరావు నియోజకవర్గంలో రథం తగలబడినప్పుడు భాజపా నేతలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో దేవాలయాలపై రాజకీయాలు జరగటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

మీ దగ్గర చూసుకోండి...

ఏపీలో జరుగుతున్న పరిణామాలపై సోమవారం భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి వెల్లంపల్లి స్పందించారు. ఆంధ్రప్రదేశ్​లో అంతా బాగానే ఉందని.. ఏమైనా ఉంటే తెలంగాణలో చూసుకోవాలని హితవు పలికారు.

'బండి సంజయ్...​ ఏమైనా ఉంటే తెలంగాణలో చూసుకోండి. ఈ రాష్ట్రంలో మీకేం పని లేదు. ఏపీలో పరిపాలన అంతా బాగానే ఉంది. మీ వ్యాఖ్యలు ఇక్కడ అవసరం లేదు. ఏమైనా ఉంటే తెలంగాణలో చూసుకుని బాగుపడండి '- వెల్లంపల్లి శ్రీనివాస్, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి

ఇదీ చదవండి:

'భాజపా కార్యకర్తలు రోడ్డెక్కితే.. జగన్ మూటాముల్లె సర్దుకోవాలి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.