రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై భాజపా, జనసేన, తెదేపాకు ప్రశ్నించే హక్కు లేదని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని పోరాడింది తమ పార్టీయేనని చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 65 లక్షల రూపాయలతో రహదారుల నిర్మాణ పనులకు మేయర్ రాయన భాగ్యలక్ష్మి.. డిప్యూటీ మేయర్ దుర్గతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు.
పుదుచ్చేరి రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రం ప్రకటన తరుణంలో రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా అడగలేని, కేంద్రాన్ని ప్రశ్నించలేని రాష్ట్ర భాజపా నాయకులు తిరుపతిలో ఏ విధంగా ఓటు అడుగుతారని ప్రశ్నించారు. జనసేనలో భాజపా విలీనం అయిందా లేదా భాజపాలో జనసేన విలీనం అయిందా అని నిలదీశారు.
ఇదీ చదవండి:
పరిషత్ ఎన్నికల్లో ఎస్ఈసీ రబ్బర్ స్టాంప్‌లా మారారు: చంద్రబాబు