దిశ బిల్లుకు మద్దతుగా నిలవాల్సిన ప్రతిపక్షం.. అవమానిస్తున్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. దిశా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. ఈ యాప్ ద్వారా చాలామంది మహిళలకు సాయం అందుతోందన్నారు. ఇటీవల కడప నుంచి దిల్లీకి పరీక్ష రాసే నిమిత్తం వెళ్లిన ఓ యువతి కూడా దిశ యాప్ ద్వారా ఏపీ పోలీసులను సంప్రదించినట్లు మంత్రి తెలిపారు. తక్షణమే స్పందించిన పోలీసులు దిల్లీ పోలీసుల సాయంతో ఆ యువతిని రక్షించారన్నారు.
ఇంకా ఆమోదం పొందకపోయినా దిశ చట్టం గురించి తెలుసుకునేందుకు ఇతర రాష్ట్రాల వాళ్లు ఏపీని సంప్రదిస్తున్నట్లు తెలిపారు. కేవలం ప్రభుత్వాన్ని అవమానపరిచేందుకే తెదేపా నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం 42 రోజుల్లో ఈ తరహా కేసుల్లో విచారణ పూర్తి చేస్తున్నామని, కేవలం వారం రోజుల్లో పోలీసులు చార్జిషీటు వేస్తున్నాjని మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ.. Protest: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో తాత్కాలిక ఉద్యోగుల సమ్మె