ETV Bharat / city

మంత్రి వేలు పట్టుకున్న నిరుపేద బాలుడు.. కారు ఎక్కించుకొని.. - minister srinivas goud helped a kid

srinivas goud: నన్ను చదివించండి సారూ అంటూ చేయిపట్టుకుని బతిమాలిన ఓ బాలుడిని చూసి.. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చలించిపోయారు . చదువుకోవాలన్న అతని ఆసక్తి, కళ్లలో ఆవేదన ఆయణ్ని కదిలించాయి. వెంటనే ఆ పిల్లాడిని ప్రైవేటు పాఠశాలలో చేర్పించారు. ఆ అబ్బాయి చదువు బాధ్యత తనదేని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. ఈ సంఘటన మహబూబ్​నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

minister srinivas goud latest news
'నన్ను చదివించండి సారూ'.. మంత్రిని బతిమాలిన బాలుడు
author img

By

Published : Jun 27, 2022, 9:48 AM IST

Srinivas goud: తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఓ ఆలయ సందర్శనకు వెళ్లారు. హఠాత్తుగా ఓ బాలుడు వచ్చి ఆయన వేలు పట్టుకుని రోదించసాగాడు. అనూహ్య పరిణామంతో ఆయనకు వెంటనే ఏమీ అర్థం కాలేదు. బాలుడిని సముదాయించి.. ఏంటని ఆరాతీయగా.. ‘నన్ను చదివించండి సారూ’ అంటూ అతడు వేడుకున్నాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండలం కాకర్లపహాడ్‌ మైసమ్మ దేవాలయం వద్ద ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది.

హన్వాడ మండలానికి చెందిన మల్లెల వెంకటేశ్‌ నిరుపేద కుటుంబానికి చెందినవాడు. సొంతూళ్లో ఆస్తిపాస్తులు లేకపోవటంతో.. అత్తగారి ఊరైన కాకర్లపహాడ్‌కు వచ్చి భార్య బుజ్జమ్మ, ఇద్దరు పిల్లలతో చిన్న రేకుల గదిలో నివసిస్తున్నాడు. మైసమ్మ ఆలయం సమీపంలోని చెట్టు కింద చిన్న డబ్బాలో కూల్​డ్రింక్స్​, వాటర్​బాటిల్స్​ పెట్టుకుని విక్రయిస్తుంటాడు. వారంలో భక్తుల రద్దీ ఉండే మూడు రోజుల్లో మినహా వీరి వ్యాపారానికి గిరాకీ ఉండదు. అరకొర ఆదాయంతో నెట్టుకొస్తున్నాడు.

వారి పెద్ద కుమారుడు విజయ్‌కుమార్‌ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో అయిదో తరగతి వరకు చదివాడు. ఇకపై చదివే స్థోమత లేక.. తల్లిదండ్రులకు సాయం చేస్తున్నాడు. ఆదివారం మైసమ్మ ఆలయ దర్శనానికి వచ్చిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ దగ్గరకు విజయ్‌కుమార్‌ పరుగు తీశాడు. ఆయన చేయి పట్టుకుని.. తనను చదివించమని కన్నీళ్లతో వేడుకున్నాడు. మంత్రి అతడిని ఓదార్చారు. తల్లిదండ్రులను పిలిచి వివరాలు తెలుసుకున్నారు. చదువుకోవాలన్న బాలుడి తపన చూసి ఆయన చలించారు. వెంటనే అతని తన వాహనంలో మహబూబ్‌నగర్‌ తీసుకెళ్లి, ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్పించారు. హాస్టల్‌ వసతి కల్పించి యూనిఫాం, పుస్తకాలు తదితరాలన్నీ ఇప్పించారు. బాలుడి చదువు పూర్తయి స్థిరపడేదాకా తాను అండగా ఉంటానని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు.

ఇదీ చదవండి:

అబ్బురపరిచే ఈ బిల్డింగ్.. ఎక్కడిదో తెలుసా..?

పుస్తకాల ముద్రణకూ డబ్బుల్లేవ్.. పిల్లల పరిస్థితేంటి..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.