కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తీసుకున్న నిర్ణయం.. పవన్ కల్యాణ్‌కు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా..? అని మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు(minister seediri appala raju slams pawan kalyan news). శ్రీకాకుళంలో మాట్లాడిన ఆయన.. స్టీల్ ప్లాంట్‌పై వైకాపా ప్రభుత్వం చేస్తున్న కృషి పవన్‌కు తెలియదా..? అని నిలదీశారు. స్క్రిఫ్టు రాసి ఇచ్చిన వారు.. పవన్ కు అసలు విషయం చెప్పకుండా పక్క దారి పట్టించారని ఎద్దేవా చేశారు. కేంద్రాన్ని ఒక్క ప్రశ్న కూడా అడగకపోవటం.. ఆయన రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమన్నారు.
'స్టీల్ ప్లాంట్ అంశంలో కేంద్రాన్ని ఒక్క మాట కూడా అడగలేదు. రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత ఎలా అవుతుంది..? పవన్ వ్యాఖ్యలు.. ఆయన తీసుకునే ప్యాకేజీలకు నిదర్శనం. పవన్ రాజకీయాలను చూసి ఏ ఒక్కరూ హర్షించరు. చంద్రబాబు నుంచి బయటపడితే పవన్‌కు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. 9 నెలల పాటు వైకాపా పోరాడుతున్న విషయం పవన్‌కు మాత్రమే తెలియదు. పార్లమెంట్ సాక్షిగా వైకాపా ఎంపీలు గళమెత్తారు' - సీదిరి అప్పలరాజు, రాష్ట్ర మంత్రి
ఇదీ చదవండి
YSR Lifetime Achievement Awards : కేంద్ర ప్రభుత్వం తరహాలోనే రాష్ట్రంలోనూ పురస్కారాలు: జగన్