ETV Bharat / city

జగన్‌తో చర్చించి ఐదు గ్రామాలు ఇప్పించండి: పువ్వాడ అజయ్​ - ఏపీ మంత్రులపై పువ్వాడ

Puvvada on AP Ministers: మంత్రులు బొత్స, అంబటి రాంబాబు వ్యాఖ్యలు బాధాకరమని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ అన్నారు. నా మాటలను వక్రీకరించి విమర్శించడం సరికాదని ఏపీ మంత్రులకు సూచించారు.

Puvvada
Puvvada
author img

By

Published : Jul 19, 2022, 5:39 PM IST

Puvvada on AP Ministers: మంత్రులు బొత్స, అంబటి రాంబాబు వ్యాఖ్యలు బాధాకరమని తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ అన్నారు. నా మాటలను వక్రీకరించి విమర్శించడం సరికాదని ఏపీ మంత్రులకు సూచించారు. హైదరాబాద్‌ ఇస్తారా అని బొత్స అనటం.. అసందర్భం, అర్థరహితమని స్పష్టం చేశారు. నా మాటల్లో తప్పేమిటో అర్థం కావడం లేదన్నారు.

జగన్‌తో చర్చించి 5 గ్రామాలను ఇప్పించండి. 5 గ్రామాలను కలిపితేనే కరకట్టల నిర్మాణం సాధ్యం. సున్నితమైన అంశాన్ని సానుకూలంగా అర్థం చేసుకోవాలి. నా మాటలను వక్రీకరించి విమర్శించడం సరికాదు. బేషజాలకు పోకుండా ప్రజా సమస్యలు పరిష్కరించాలి.- పువ్వాడ అజయ్, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి

భద్రాచలం ఆలయం మునగకుండా ఉండాలనేది మా ఉద్దేశమని మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు. కరకట్టల నిర్మాణానికి 5 గ్రామాలను ఇవ్వాలని కోరుతున్నట్లు వెల్లడించారు. కేసీఆర్‌తో జగన్ చర్చలకు బొత్స, అంబటి కృషి చేయాలని సూచించారు. భద్రాచలం రాముడు మునగకుండా చూడాలంటే ఏపీ సహకరించాలని పువ్వాడ అజయ్ విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.