ETV Bharat / city

రాజధాని పేరుతో విజయవాడ, గుంటూరును నాశనం చేశారు: పేర్ని నాని - ap latest news

తెదేపా అధినేత చంద్రబాబుపై మంత్రి నాని విమర్శలు గుప్పించారు. రాజధాని పేరుతో గుంటూరు, విజయవాడ నగరాలను నాశనం చేశారని ఆరోపించారు. విజయవాడ నగరంలో ఒక్క బైపాస్ నిర్మాణమైనా చేశారా అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో తెదేపాకు ప్రజలు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.

minister perni nani
minister perni nani fiers on chandrababu
author img

By

Published : Mar 7, 2021, 5:45 PM IST

రాజధాని అమరావతి పేరుతో గుంటూరు, విజయవాడ నగరాలను నాశనం చేసిన తెదేపా అధినేత చంద్రబాబు.. నగర పాలక సంస్థ ఎన్నికల్లో మళ్లీ ఓట్లు అడిగేందుకు ఎలా వచ్చారని మంత్రి పేర్ని నాని నిలదీశారు. ఉపాధి కల్పనకు ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో నాని మీడియాతో మాట్లాడారు.

'ప్రజల ఆశలు, ఆకాంక్షలను మీరు దోచుకున్నారు. అమరావతిలో ఏం చేశారు? విజయవాడలో ఒక్క బైపాస్‌ నిర్మాణమైనా చేశారా? నగరంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి ఏమైనా చేశారా? విజయవాడలో ఐటీ, ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేశారా?' అని చంద్రబాబును నాని ప్రశ్నించారు. అమరావతిలో 54వేల మంది నిరుపేదలకు నివాసం కల్పిస్తామంటే..కుట్రలు చేసి స్టేలు తెప్పించారని విమర్శించారు. దోచుకోవడం, దాచుకోవడంపైనే చంద్రబాబుకు ప్రేమ ఉంటుందని దుయ్యబట్టారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు కేంద్రంలో పరపతి ఉంటే విశాఖ ఉక్కు కోసం ఏదైనా చేసి చూపాలని హితవు పలికారు. మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

'బంగారు బంగాల్' కల నెరవేరబోతోంది: మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.