ఏకగ్రీవాలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఏకగ్రీవాలపై ప్రభుత్వం పత్రికల్లో ప్రకటన ఇచ్చిందని.. అందులో రాజకీయం ఎక్కడుందో ఎస్‌ఈసీ చెప్పాలన్నారు. ఏకగ్రీవాలపై ప్రోత్సాహకాలు కొత్త కాదని స్పష్టం చేశారు. ఏకగ్రీవాలను ఎస్ఈసీ ఎలా తప్పు పడతారని ప్రశ్నించారు.
ఏకగ్రీవాలు ఎక్కువైతే వ్యతిరేకిస్తామనడం సరికాదన్నారు. అధికార పార్టీకి ఎస్‌ఈసీ దురుద్దేశాలు అంటగడుతున్నారని వ్యాఖ్యానించారు. ద్వివేది, గిరిజాశంకర్‌పై ఎస్‌ఈసీ వైఖరి గందరగోళంగా ఉందని చెప్పారు.
ఎస్‌ఈసీనే చట్టాలను ఉల్లంఘిస్తున్నారు: పెద్దిరెడ్డి
పదవీ విరమణ చేస్తున్నారన్న తొందరలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. చట్టపరమైన ప్రక్రియను పక్కన పెట్టారని విమర్శించారు. 2019లో అనుసరించిన ఓటర్ల జాబితా ప్రక్రియను 2021లో ఎందుకు పక్కన పెట్టారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్ఈసీ వైఖరి వల్ల లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఓటర్ల జాబితా తయారీకి ఎందుకు సమయం ఇవ్వలేదు చెప్పాలని వ్యాఖ్యానించారు. చట్టాలను ఉల్లంఘిస్తూ ప్రభుత్వంపైన అధికారులపైనా ఎస్ఈసీ దురుద్ధేశాలు అపాదిస్తున్నారని మంత్రి ఆరోపించారు.
సంబంధిత కథనం: