ETV Bharat / city

రైతులకు సచివాలయంలో ఏం పని ఉంటుంది: మంత్రి పెద్దిరెడ్డి - three capitals for AP news

అమరావతిలో 33 వేల ఎకరాలను అభివృద్ధి చేసే పరిస్థితి లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉద్ఘాటించారు. అనవసరంగా తెదేపా నేతలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రైతులకు మంచి ప్యాకేజీ ఇచ్చి న్యాయం చేయాలని సీఎం జగన్ చూస్తున్నారని తెలిపారు.

minister peddireddy comments on amaravthi formers

author img

By

Published : Dec 30, 2019, 5:26 PM IST

మూడు రాజధానులతో రాష్ట్రమంతా సమానంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలో 33 వేల ఎకరాలను అభివృద్ధి చేయాలంటే సాధ్యం కాదన్న ఆయన... మంచి ప్యాకేజీ ఇచ్చి రైతులకు న్యాయం చేయాలని సీఎం జగన్ చూస్తున్నారని తెలిపారు. ల్యాండ్ పూలింగ్‌లో తీసుకున్న భూమిని వెనక్కు ఇస్తామని చెప్పారు. అమరావతిలో తగిన భూమి తీసుకొని అంతవరకు అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

రైతులకు సచివాలయంలో ఎలాంటి పని ఉండదని... కేవలం ఐదు నుంచి పది శాతం మందికే పని ఉంటుందన్నారు. ప్రస్తుతం రైతులతో మాట్లాడే పరిస్థితి లేదని.. వాళ్లు వినే పరిస్థితుల్లో కూడా లేరని వ్యాఖ్యానించారు. తప్పకుండా రైతులు వాస్తవాలు తెలుసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇసుక విధానానికి మంచి పేరు వచ్చింది

సెప్టెంబరు 5 నుంచి ఇప్పటివరకు 45 లక్షల టన్నుల ఇసుక సరఫరా చేశామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. స్టాక్ యార్డుల్లో సరిపడా ఇసుకను నిల్వ చేస్తున్నామని చెప్పారు. కొత్త ఇసుక విధానం ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చిందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇసుక తవ్వుతున్నామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి : 'అమరావతి రైతుల భూములు తిరిగి ఇచ్చేస్తాం'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.