దిల్లీ పర్యటనలో భాగంగా మూడో రోజు రాష్ట్ర మంత్రి గౌతమ్‌రెడ్డి ..పలువురు కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ సీఈవోను కలిశారు. కడపలోని కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్(ఈఎంసీ) 2.0 కింద కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, దీన్ని సందర్శించాలని కోరారు. కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవటానికి, భవిష్యత్‌కు తగినట్లు యువతను మరింతగా తీర్చిదిద్దటానికి 5జీ ప్రయోగశాల ఏర్పాటుకు కేంద్రం సహకారం అందించాలన్నారు.
రాయలసీమలోని కొప్పర్తి, ఓర్వకల్‌లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు సహకారం అందించాలని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్ వదావన్‌ను మంత్రి గౌతమ్‌రెడ్డి కోరారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల(పీఎల్‌ఐ) పథకం కింద కొప్పర్తి ఈఎంసీలో గృహోపకరణాల రంగంలో ఉత్పత్తి సామర్థ్యం పెంచుకోవడానికి తోడ్పాటు అందించాలని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్‌ను కోరారు. తితిదే పర్యావరణం దెబ్బతినకుండా అక్కడ నడిపే వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చటానికి నిధులు ఇవ్వాలన్నారు. సౌర, పవన విద్యుత్ ఆధారిత అత్యాధునిక కెమికల్ బ్యాటరీ తయారీ ప్రాజెక్టును రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటుకు అనుమతులు, నిధులు సమకూర్చాలని కోరారు.
ఇదీ చదవండి: దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా ఫలితాలు ఉండాలి: జగన్