ETV Bharat / city

KTR tweet on Somu Veerraju: వావ్.. వాట్ ఎ స్కీం.. వాట్ ఎ షేమ్.. సోము వీర్రాజుపై కేటీఆర్​ సెటైర్​! - somu veerraju on liquor rates in ap

KTR tweet on Somu Veerraju: అధికారంలోకి వస్తే రూ. 75 కే చీప్ లిక్కర్ ఇస్తామంటూ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ఇదే భాజపా జాతీయ విధానమా అని ట్విటర్​ వేదికగా విమర్శించారు. భాజపా నేతలు మరింతగా దిగజారిపోయి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.

కేటీఆర్
కేటీఆర్
author img

By

Published : Dec 29, 2021, 1:46 PM IST

KTR tweet on Somu Veerraju: ఆంధ్రప్రదేశ్​లో భాజపా అధికారంలోకి వస్తే రూ. 70 కే మద్యం విక్రయిస్తామన్న భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్​ వ్యంగ్యంగా స్పందించారు. వావ్​.. వాట్​ ఎ స్కీమ్​.. వాట్​ ఎ షేమ్​ అంటూ వ్యాఖ్యానించారు. అధికారం కోసం ఏపీ భాజపా నేతలు మరింతగా దిగజారిపోయి వ్యాఖ్యలు చేస్తున్నారని ట్విటర్​ వేదికగా విమర్శించారు. చీప్​ లిక్కర్​ను రూ. 50, రూ.70 కి విక్రయించడం భాజపా జాతీయ విధానమా లేక.. నిరాశవాదంలో కూరుకుపోయిన రాష్ట్రాలకు మాత్రమే ఈ బంపర్ ఆఫర్​ వర్తిస్తుందా అని ప్రశ్నించారు.

  • Wah…what a scheme! What a shame 😝 AP BJP stoops to a new low

    National policy of BJP to supply cheap liquor at ₹50 or is this bumper offer only for states where the desperation is “high”? https://t.co/SOBiRq5gNu

    — KTR (@KTRTRS) December 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సోము వీర్రాజు స్టేట్​మెంట్​

విజయవాడలో మంగళవారం జరిగిన భాజపా ప్రజాగ్రహ సభలో సోము వీర్రాజు పలు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను కోటి ఓట్లతో గెలిపిస్తే.. లిక్కర్​ను రూ. 70 కే విక్రయిస్తామని ప్రకటించారు. రాష్ట్ర రెవెన్యూ మెరుగ్గా ఉంటే రూ. 50 కే విక్రయిస్తామని పేర్కొన్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్​ కాగా.. మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

ఇదీ చదవండి:

JAGANNANNA PALAVELLUVA: అమూల్ ఒక కంపెనీ కాదు.. పాలు పోసేవాళ్లే యజమానులు: సీఎం జగన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.