ETV Bharat / city

ktr tweet: హుజూరాబాద్ ఓటమిపై కేటీఆర్ ఎలా స్పందించారంటే...

తెలంగాణ రాష్ట్రంలోని హుజూరాబాద్ ఉపఎన్నిక ఓటమిపై మంత్రి కేటీఆర్(minister ktr) స్పందించారు. ఈ ఓటమితో పెద్దగా ఒరిగేదేమీ లేదన్నారు. గత 20 ఏళ్లలో తెరాస ఎన్నో ఆటుపోట్లను చవిచూసిందని మంత్రి పేర్కొన్నారు. స్ఫూర్తిదాయకంగా పోరాడిన తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు ఆయన అభినందనలు తెలిపారు.

ktr
ktr
author img

By

Published : Nov 2, 2021, 9:54 PM IST

తెలంగాణ రాష్ట్రంలోని హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమితో ఒరిగేదేమీ లేదని మంత్రి కేటీఆర్(minister ktr) అన్నారు. గత 20 ఏళ్లలో తెరాస ఎన్నో ఆటుపోట్లను చవిచూసిందని మంత్రి పేర్కొన్నారు. స్ఫూర్తిదాయకంగా పోరాడిన తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు ఆయన అభినందనలు తెలిపారు. భవిష్యత్తు పోరాటాలకు కార్యకర్తలు సన్నద్ధంగా ఉండాలని మంత్రి ట్వీట్​ చేశారు.

ఈ ఎన్నికకు ప్రాధాన్యం లేదు

ఈ ఉప ఎన్నికకు అంతగా ప్రాధాన్యం లేదని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. హుజూరాబాద్‌ ఎన్నిక కోసం శ్రమించిన మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో మంత్రులు హరీశ్‌ రావు, కొప్పుల, గంగుల బాగా శ్రమించారని కొనియాడారు. పార్టీ తరఫున కృషి చేసిన ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు, తెరాస సామాజిక మాధ్యమ యోధులను మంత్రి కేటీఆర్‌ అభినందించారు.

  • In the last 20 years TRS has seen many highs and lows & this one election result will not be of much significance or consequence

    My compliments to @GelluSrinuTRS on a spirited fight 👍

    Appeal to all TRS workers to work with increased resolve to forge ahead in future battles

    — KTR (@KTRTRS) November 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: ETELA WON: హుజురాబాద్​లో ఈటల ఘన విజయం.. 24 వేల 68 ఓట్ల మెజార్టీతో గెలుపుబావుటా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.