ETV Bharat / city

KTR Tweet to Rahul : రాహుల్ ద్రవిడ్ కు కేటీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే?

టీమిండియా వాల్.. మిస్టర్​ డిపెండబుల్ గా.. అనితర సాధ్యమైన క్రికెట్ ఆడి, ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన రాహుల్ ద్రవిడ్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్.. ట్వీట్ చేశారు. మరి, అందులో ఏముందో చూడండి...

KTR Tweet to Rahul
KTR Tweet to Rahul
author img

By

Published : Nov 4, 2021, 4:14 PM IST

టీమిండియా వాల్.. మిస్టర్​ డిపెండబుల్​ రాహుల్ ద్రవిడ్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్.. ట్విట్టర్​ వేదికగా అభినందనలు తెలిపారు. తాన అత్యంత అభిమానించే క్రికెటర్​ అయిన ద్రవిడ్​.. భారత క్రికెట్ జట్టుకు కోచ్​గా ఎంపిక కావటం పట్ల.. మంత్రి కేటీఆర్​ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్​ చేశారు. తన ఆటతో సత్తా చాటిన ద్రవిడ్​.. ఇప్పుడు తన సారథ్యంలో టీమిండియాను మరిన్ని ఉన్నత శిఖరాలకు చేర్చటంలోనూ కీలక పాత్ర పోషించనున్నాడని ఆకాంక్షించారు.

"నాకు ఎంతో ఇష్టమైన క్రికెటర్‌ ద్రవిడ్​.. టీమిండియా కోచ్​గా ఎంపికైనందుకు నా అభినందనలు. మీ సారథ్యంలో భారత సీనియర్​ పురుషుల బృందం ఇంక ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాను." - కేటీఆర్​, మంత్రి

" class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇప్పటికే మంచి కోచ్​గా​..
వివిధ జట్లకు కోచ్‌గా ద్రవిడ్‌(Rahul Dravid India Coach News) ఇప్పటికే సత్తాచాటాడు. 2014 నుంచి రెండేళ్ల పాటు ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. 2016లో అండర్‌-19, భారత్‌- ఏ జట్లకు కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న అతను.. యువ ఆటగాళ్లను సానబెట్టాడు. తన శిక్షణలో 2016 అండర్‌-19 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత్‌.. 2018లో కప్పు అందుకుంది. ఆ సమయంలోనే సీనియర్‌ జట్టు కోచ్‌గా వ్యవహరించాలని బీసీసీఐ కోరినా.. యువ ఆటగాళ్ల కోసం సున్నితంగా తిరస్కరించాడు.

మరో జట్టుకు తాత్కాలిక కోచ్​గా..
2019 నుంచి జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌గా పదవి చేపట్టి.. అక్కడికి వచ్చే భారత ఆటగాళ్లను ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నాడు. ఇటీవల టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉండగా.. పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం శ్రీలంక వెళ్లిన మరో భారత జట్టుకు ద్రవిడ్‌ తాత్కాలిక కోచ్‌గా పనిచేశాడు.

అన్ని ఫార్మాట్లలో పట్టు..
ద్రవిడ్‌కు అన్ని ఫార్మాట్లలో తిరుగులేని పట్టుండటం కలిసొచ్చే అంశం. వన్డే, టెస్టుల్లో రాహుల్‌ ఆట గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. రాజస్థాన్‌(కోచ్‌), దిల్లీ(మెంటార్‌) ఐపీఎల్‌ జట్లకు వ్యవహరించిన అనుభవం ఉంది. శ్రేయస్‌ అయ్యర్‌ వంటివారిని వెలుగులోకి తెచ్చింది రాహులే.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.