వర్షాలు, వరదల పేరుతో నిత్యావసరాలకు కృత్రిమ కొరత సృష్టించి.. అధిక ధరలకు విక్రయిస్తే కఠినంగా వ్యవహారించాలని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి కన్నబాబు తెలిపారు. దుకాణాల వద్ద తప్పనిసరిగా ధరల బోర్డులు ఉంచాలని... అలా పెడుతున్నారా లేదో పర్యవేక్షించాల్సిన బాధ్యతను జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు అప్పగించారన్నారు. ఉల్లి ధర పెరగడంతో నాఫెడ్ ద్వారా 6 వేల టన్నుల ఉల్లి కొనుగోలుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.
అన్ని జిల్లా కేంద్రాల్లోని రైతు బజార్లలో రేపటి నుంచి కిలో రూ. 40కు ఉల్లి విక్రయాలు జరుగుతాయన్నారు. విజయవాడ స్వరాజ్ మైదానంలోని రైతుబజారులో ఉల్లి ప్రత్యేక విక్రయ కేంద్రాలను మంత్రి కన్నబాబు ప్రారంభించారు. మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయల స్టాక్ తెప్పిస్తున్నామని... వినియోగదారులకు 40 రూపాయలకు ఉల్లి విక్రయించి- మిగిలిన సబ్సిడీ ధరను భరించడానికి ప్రభుత్వం సిద్ధమైందని అన్నారు.
ఇదీ చదవండి