రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న కర్ఫ్యూ నిబంధనల నుంచి ఉద్యానవన ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లను మినహాయిస్తున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. మామిడి, టమాట ధరలను తగ్గకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. మామిడి ధరలను ప్రతి రోజు పర్యవేక్షించాలన్నారు.
మామిడి ధరల విషయంలో రైతులకు న్యాయం జరిగేలా చూడాలని.. ఉద్దేశపూర్వకంగా ధరలు తగ్గిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 2 వేల టన్నుల టమాటాలను ప్రాసెసింగ్ యూనిట్స్ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రైతు బజార్లలో నో మాస్క్ నో ఎంట్రీ విధానం అమలు చేయాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి:
రాష్ట్రంలో వెంటనే.. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి: ఎమ్మెల్సీ మంతెన