అమరావతిలో పెండింగ్ ఉన్న పనులను కొలిక్కి తేవాలని ప్రభుత్వం చూస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు సీఎం జగన్పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని.. అమరావతిని నిర్లక్ష్యం చేస్తామని ప్రభుత్వం చెప్పలేదన్నారు.
చంద్రబాబు రెండు రకాలుగా మాట్లాడతారని మంత్రి కన్నబాబు ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపాకు మెజారిటీ వచ్చిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సైతం అదే తీర్పు వస్తుందని పేర్కొన్నారు. వైకాపాకు కుప్పం, ఇచ్ఛాపురం ఎక్కడైనా రిజల్ట్ ఓకేలా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అవినీతిని అరికట్టాలనే ఉద్దేశంతోనే దుర్గ గుడిలో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: