సోమశిలతో పాటు పెన్నమ్మ జలాశయంలోకి భారీగా వస్తున్న వరద నీటిని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పరిశీలించారు. నివర్ తుపాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని స్పష్టం చేశారు. జలాశయాల్లో నీటి నిల్వ, వరద వివరాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జలాశయం లెఫ్ట్ బ్యాంక్ పొర్లుకట్ట కోతకు గురైన ప్రాంతాన్ని మంత్రి పరిశీలించారు. రాబోయే రోజుల్లో మరో రెండు తుపాన్లు ఉన్నందున్న అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి
ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. మారమ్మకు ఇల్లు కట్టిస్తామని హామీ