ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ పాలసీ అమలు తీరు, దాని ప్రభావాల అంచనాకు.. పరిశ్రమల్లో గవర్నెన్స్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. కాన్ఫరెన్స్ ఆన్ ఇండియా@75 సమావేశంలో పాల్గొన్న ఆయన.. 'వేగవంతమైన వృద్ధిలో ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాలు' అనే అంశంపై మాట్లాడారు. సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ వర్చువల్ సదస్సుకు లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ సహా పలువురు హాజరయ్యారు. అనేక ఆలోచనలున్నా.. కొవిడ్ వల్ల పారిశ్రామిక రంగంలో ఆశించిన సంస్కరణలు చేపట్టలేకపోయామన్నారు.
చదువుకున్న వాళ్లల్లో చాలా మంది పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా లేరని ఇటీవల మా సర్వేలో తెలిసింది. ఐటీఐ, నైపుణ్య కళాశాలల్లో బోధనా పద్ధతులను మేం గమనించాం. వీటిలో చాలావరకు కళాశాలల్లో కొత్త తరహా నైపుణ్య కోర్సులు అందుబాటులో లేవు. ఈ కళాశాలల్లో కొత్త కోర్సులను ప్రవేశపెడుతూనే రాష్ట్రవ్యాప్తంగా 26 నైపుణ్య కళాశాలలను తీసుకొస్తున్నాం. ఆయా జిల్లాల్లోని పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఈ కళాశాలలు నడుచుకోనున్నాయి._మంత్రి గౌతం రెడ్డి.
ఇదీ చదవండి:
RUIA INCIDENT: 'ఏపీలో ఆక్సిజన్ కొరతతో కొవిడ్ బాధితులు మరణించారు'