ETV Bharat / city

రాష్ట్రంలో బొమ్మలు, వైద్య పరికరాల తయారీలో పెట్టుబడులకు జర్మనీ ఆసక్తి

author img

By

Published : Mar 23, 2021, 1:07 PM IST

Updated : Mar 23, 2021, 3:17 PM IST

బొమ్మలు, వైద్య పరికరాల తయారీలో జర్మనీ పెట్టుబడులకు ఆసక్తి చూపుతోందని.. పరిశ్రమల శాఖ మంత్రి గౌతంరెడ్డి తెలిపారు. విజయవాడలోని ఏపీటీఎస్ కార్యాలయంలో.. జర్మనీ కాన్సులేట్ జనరల్ కరిన్ స్టోల్‌తో మంత్రి సమావేశమయ్యారు.

Minister Gautam Reddy helds meeting with German Consulate General Karin Stoll
జర్మనీ కాన్సులేట్ జనరల్ కరిన్ స్టోల్​తో మంత్రి గౌతంరెడ్డి భేటీ

విజయవాడలోని ఏపీటీఎస్ కార్యాలయంలో.. పరిశ్రమల శాఖ మంత్రి గౌతంరెడ్డి, జర్మనీ కాన్సులేట్ జనరల్ కరిన్ స్టోల్‌తో సమావేశమయ్యారు. బొమ్మలు, వైద్య పరికరాల తయారీలో జర్మనీ పెట్టుబడులకు ఆసక్తి చూపుతోందని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం రెండేళ్లుగా నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టిందన్నారు. ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాల గురించి ఏపీఐఐసీ ప్రజంటేషన్ ఇచ్చింది. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు జర్మన్ కాన్సూల్ జనరల్​కు మంత్రి వివరించారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు.

ఎయిర్ పోర్టులు, ఇండస్ట్రియల్ నోడ్లు, ఈఎంసీలు, పోర్టులు, హార్బర్లు సహా మౌలిక సదుపాయాల గురించి.. అధికారులు వివరించారు.

కరిన్ స్టోల్, జర్మనీ కాన్సుల్ జనరల్

పెద్దసంఖ్యలో ఉన్న చిన్న రైతులకు మరింత సురక్షితమైన భవిష్యత్తు అందించేందుకు కమ్యూనిటీ ఫార్మింగ్‌ అనే ప్రక్రియపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణాలు పెంచే విధానం మేళవింపుతో కూడిన ఈ ప్రయత్నాన్ని జర్మనీ కూడా ప్రోత్సహిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి మరింత సహకారం కోసం ఎదురు చూస్తున్నాం.ఉత్పత్తి రంగంతోపాటు సౌర విద్యుత్ తదితర అంశాలపై.. ఏపీ ప్రభుత్వంతో చర్చించాం.

-కరిన్ స్టోల్, జర్మనీ కాన్సుల్ జనరల్

ఇదీ చదవండి:

ఎయిడెడ్‌ పోస్టుల భర్తీకి హడావుడి!

Last Updated : Mar 23, 2021, 3:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.