ETV Bharat / city

కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: తెలంగాణ మంత్రి ఈటల - కరోనా వైరస్​పై తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలు

ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే సత్తా తెలంగాణ ప్రభుత్వానికి ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ స్పష్టం చేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు కమిటీలు వేశామన్నారు.

minister-eetela-rajendar-spoke-on-karona-virus
తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్
author img

By

Published : Mar 5, 2020, 6:04 PM IST

తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్

కరోనాపై తెలంగాణ వైద్య విభాగం 4 రోజులుగా అప్రమత్తంగా ఉందని మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. ప్రజలకు అవగాహన కల్పించడంలో మీడియా బాగా సహకరించిందన్నారు. కొవిడ్​-19ను ఎదుర్కోవడానికి ప్రత్యేక కమిటీలు వేశామని.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చర్యలను చూసి కేంద్రం కితాబిచ్చిందని తెలిపారు.

ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే సత్తా తెలంగాణ ప్రభుత్వానికి ఉందని మంత్రి ఈటల వెల్లడించారు. ఈ వైరస్‌ గాలితో వచ్చేది కాదన్నారు. కరోనా వచ్చిందంటూ సాఫ్ట్‌వేర్‌ కార్యాలయాన్ని ఖాళీ చేశారని చెప్పారు. ఎప్పుడూ అతిగా స్పందించవద్దంటూ హితవు పలికారు. ఇప్పటివరకు తెలంగాణలో ఒక్కరికి కూడా కరోనా రాలేదని.. గాంధీలో ఉన్న వ్యక్తికి కరోనా దుబాయిలో వచ్చిందని తెలిపారు. ఆ వ్యక్తి 2 రోజుల్లో డిశ్చార్జ్‌ అయ్యే అవకాశం ఉందని చెప్పారు.

మొత్తం 21 నమూనాలు నెగిటివ్‌ వచ్చాయని, ఈరోజు కొత్తగా వైద్యులు 10మంది నమూనాలు తీసుకున్నారని పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు 'మాకు పరీక్షలు చేయండి' అంటున్నారని, ఆ విధంగా ఇన్ఫెక్షన్​ లేకున్నా పరీక్షలు చేయడం కుదరదని ఈటల చెప్పారు. ఐసోలేషన్‌కు సిద్ధంగా ఉన్నట్లు అన్ని మెడికల్‌ కళాశాలలు చెప్పాయని పేర్కొన్నారు. ఈ వైరస్​ను ఎదుర్కొనేందుకు అన్ని విభాగాలు, తాము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామని మంత్రి స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: గ్రామాల్లో బెల్టు షాపులు ఉండకూడదు: సీఎం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.