భోగాపురం విమానాశ్రయం పనులు వెంటనే ప్రారంభించాలని కేంద్రమంత్రి హర్దీప్సింగ్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు. దిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన బుగ్గన... ఓర్వకల్లు విమానాశ్రయ పనులపై చర్చించారు. ఓర్వకల్లులో తుదిదశ పనులకు త్వరగా అనుమతి ఇవ్వాలని కోరామని తెలిపారు.
వచ్చే నెలలో ఓర్వకల్లు విమానాశ్రయం ప్రారంభించే అవకాశం ఉందని మంత్రి బుగ్గన వెల్లడించారు. తమ విజ్ఞప్తిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. 2 విమానాశ్రయాలకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారన్నారు. రాష్ట్ర ప్రాజెక్టులపై కేంద్రానికి సిఫారసు చేయాలని నీతిఆయోగ్‌ను కోరతామని బుగ్గన పేర్కొన్నారు. యురేనియం, కిడ్నీ వ్యాధుల ప్రాంతాల్లో నీటి ప్రాజెక్టులకు సాయం కోరతామని చెప్పారు.
ఇదీ చదవండి