ETV Bharat / city

విద్యుత్తు ఒప్పందాల ధరలు తగ్గించండి: బుగ్గన - కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్.కె. సింగ్​తో బుగ్గన రాజేంద్రనాథ్​రెడ్డి

థర్మల్​ విద్యుత్తు ఒప్పందాలకు గత ప్రభుత్వం చేసుకున్న ధరలు అధికంగా ఉన్నందున వాటిని తగ్గించాలని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్.కె. సింగ్​కు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్తు ఆర్థిక, గ్రామీణ విద్యుదీకరణ సంస్థల్లో చేసిన రుణాల చెల్లింపు ప్రక్రియ పునర్నిర్మానానికి సహకరించాలని ఆయన కోరారు.

minister buggana rajendranath
విద్యుత్తు ఒప్పందాల ధరలు తగ్గించండి
author img

By

Published : Jan 29, 2021, 6:24 AM IST

థర్మల్​ విద్యుత్తు ఒప్పందాలకు సంబంధించి గత ప్రభుత్వం చేసుకున్న ధరలు అధికంగా ఉన్నందున వాటిని తగ్గించాలని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్.కె. సింగ్​కు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​రెడ్డి విజ్ఞప్తి చేశారు. దిల్లీలో కేంద్ర మంత్రితో బుగ్గన , రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్​దాస్​, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్.ఎస్. రావత్​, ఏపీ భవన్​ రెసిడెంట్​ కమిషనర్​ భావనా సక్సేనా గురువారం సమావేశమయ్యారు.

రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్తు ఆర్థిక సంస్థ (పీఎఫ్​సీ), గ్రామీణ విద్యుదీకరణ సంస్థల్లో (ఆర్​ఈసీ) చేసిన రుణాల చెల్లింపు ప్రక్రియ పునర్నిర్మానానికి (డెబిట్​ రీస్ట్రక్టర్​) సహకరించాలని కేంద్రమంత్రిని కోరారు. అనంతరం బుగ్గన బృందం ఆర్​ఈసీ ఛైర్మన్​, సంజయ్​ మల్హోత్రా, పీఎఫ్​సీ ఛైర్మన్​ రవీందర్​సింగ్​ థిల్లాన్​లతో వేర్వేరుగా సమావేశమైంది. రుణాల చెల్లింపు ప్రక్రియ పునర్నిర్మాణానికి సహకరించాని రెండు సంస్థల ఛైర్మన్లకు మంత్రి బుగ్గన విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

దిల్లీలో మంత్రి బుగ్గన పర్యటన.. నేడు, రేపు కేంద్రమంత్రులతో భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.