ETV Bharat / city

రాజధానిలో మంత్రి బొత్స పర్యటన.. పూర్తయిన నిర్మాణాల పరిశీలన - minister botsa visited crda structure news

రాష్ట్ర మంత్రి బొత్స రాజధాని ప్రాంతంలో పర్యటించారు. రహదారులు, కరకట్ట మార్గం, ఇప్పటివరకూ పూర్తైన నిర్మాణాలు, పేదల గృహ నిర్మాణ ప్రాజెక్టులను ఆయన పరిశీలించారు.

రాజధాని ప్రాంతంలో మంత్రి బొత్స పర్యటన
రాజధాని ప్రాంతంలో మంత్రి బొత్స పర్యటన
author img

By

Published : Jun 22, 2020, 12:24 PM IST

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని ప్రాంతంలో పర్యటించారు. ఇప్పటి వరకు పూర్తైన నిర్మాణాలు, రహదారులను మంత్రి పరిశీలించారు. సీడ్ యాక్సెస్ రహదారి, డక్టుల నిర్మాణం, వరదనీటి పైపు లైన్ల ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొండవీటి వాగు ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి రాయపూడి వరకు ఉన్న కరకట్ట మార్గాన్ని పరిశీలించారు.

రోడ్ల విస్తరణ అంశంపై అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. రాజధాని ప్రాంతంలో నిర్మించిన పేదల గృహ నిర్మాణ ప్రాజెక్టులను బొత్స పరిశీలించారు. మంత్రి వెంట సీఆర్డీఏ కమిషనర్​తో పాటు పురపాలక కార్యదర్శి జె.శ్యామలరావు, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.

ఇదీ చూడండి:

పట్టా భూముల్లో ఇసుక నాణ్యతపై ఆరా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.