నివర్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టాలని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. వరద నీటి నిల్వ కారణంగా ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన కార్యాచరణను అమలు చేయాలని సూచించారు. మరో రెండు రోజుల్లో ఇంకో తుపాను రానుందనే హెచ్చరికల తరుణంలో ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవడంతో పాటు, కంట్రోల్ రూంలను కొనసాగించాలని ఆయన స్పష్టం చేశారు. ఈమేరకు పురపాలక శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి... పలు సూచనలు చేశారు.
భారీ వర్షాలతో ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువైన మంచి నీటి ట్యాంకులు, చెరువులకు గండ్లు పడకుండా, నిరంతర పర్యవేక్షణ ఉండాలని మంత్రి బొత్స ఆదేశించారు. రాకపోకలకు అంతరాయం కలిగించేలా, రోడ్లపై పడిపోయిన చెట్లను తొలగించడంతో పాటు, పూడుకుపోయిన డ్రైన్లను శుభ్రం చేయాలన్నారు. పంపిణీ చేస్తున్న తాగునీరు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన క్లోరినేషన్ ప్రక్రియను చేయాలని స్పష్టం చేశారు. అనంతరం టిడ్కో గృహ నిర్మాణంపైన మంత్రి బొత్స సమీక్షించారు. లబ్ధిదారులకు అర్హతా పత్రాల అందజేత, బ్యాంకు రుణాల అనుసంధానం అంశాన్ని వేగవంతం చేయాలన్నారు.
ఇదీ చదవండి: