ఉద్యోగుల పీఆర్సీ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ(minister botsa satyanarayana comments on prc) అన్నారు. ఇప్పటికే ఉద్యోగులతో పలుమార్లు సంప్రదింపులు జరిపామన్నారు. విజయనగరంలో మాట్లాడిన మంత్రి.. ఐఆర్ ప్రకటించామని.. మిగిలిన అంశాలపై ఉద్యోగులు కొంత సంయమనం పాటించాలని కోరారు.
బిల్లుల విషయమై పురపాలక సంఘాల్లో.. గుత్తేదారుల ఆందోళనపైనా మంత్రి స్పందించారు. పనులు చేసిన గుత్తేదారులందరికీ తప్పకుండా బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేశారు. చెల్లింపుల ప్రక్రియ ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగదన్నారు. గ్రామ పంచాయతీల నిర్వహణ ఖర్చుల చెల్లింపులకే 15వ ఆర్థిక సంఘం నిధులు తీసుకున్నామని (minister botsa reaction on ap sarpanches protest for panchayat funds)మంత్రి చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశాలూ లేవన్నారు. ప్రతిపక్షాలు వాస్తవాలు పరిశీలించకుండా ఆరోపణలు చేయటం సరికాదని అన్నారు. వరదల విషయంలోనూ ప్రభుత్వం ఎక్కడా నిర్లక్ష్యంగా వహించటం లేదని స్పష్టం చేశారు.
కార్యాచరణ ప్రకటించిన ఉద్యోగ సంఘాలు..
వేతన సవరణతోపాటు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు(employees JAC protest) ఆందోళన బాటపట్టనున్నాయి. ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన సంఘ నేతలు.. డిసెంబర్ 7 నుంచి జనవరి 6 వరకు పలు దఫాలుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. వీటితోపాటు.. ప్రాంతీయ సదస్సులూ తలపెట్టనున్నట్లు ప్రకటించారు. ఇది తొలి దశ ఆందోళన మాత్రమేనని.. ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే రెండో దశ మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.
ఉద్యమ కార్యాచరణ నోటీసును డిసెంబరు 1న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇస్తామని చెప్పారు. రెండు నెలలుగా ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లినా ఉపయోగం లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వమే ఉద్యమం దిశగా తమను నెట్టిందని.. ఇందుకు సర్కారే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి
Central Team Meet CM Jagan: వరదలతో కడప జిల్లాకు భారీ నష్టం.. సీఎం జగన్తో కేంద్ర బృందం