నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజధానిగా విశాఖ వద్దని చెప్పడానికి రఘురామకృష్ణరాజు ఎవరని..? ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర జోలికి వస్తే ఉపేక్షించమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్ భిక్షతోనే రఘురామకృష్ణరాజు లోక్సభలో అడుగుపెట్టారని అన్నారు. సీఎం జగన్ పై విమర్శలు సరికావని హితవు పలికారు. రఘురామకృష్ణరాజు నరసాపురం వరకే పరిమితం కావాలని వ్యాఖ్యానించారు. వైకాపా విధానాలు నచ్చకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని చెప్పారు.
నలందకిశోర్ మృతి విషయంలో రఘురామకృష్ణరాజు ప్రభుత్వాన్ని విమర్శించటం సరికాదు. జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మీరు ఎంపీగా గెలిచారు. దయచేసి చంద్రబాబు నాయుడులో మాయలో పడొద్దు. విశాఖను రాజధానిగా వద్దని చెప్పడానికి మీరెవరూ..? ఉత్తరాంధ్ర అనేది ఉద్యమాల గడ్డ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దిగజారుడు రాజకీయాలను పక్కనపెట్టండి. పార్టీ విధానాలు నచ్చకపోతే రాజీనామా చేయండి.- మంత్రి అవంతి శ్రీనివాస్
ఇదీ చదవండి:
రాష్ట్రపతికి సమస్యలు వివరించా.. సానుకూలంగా స్పందించారు: ఎంపీ రఘురామకృష్ణరాజు