రాష్ట్రంలో ప్రజల్ని భయాందోళనలకు గురయ్యేలా చంద్రబాబు మాట్లాడటం సరికాదని ఉపముఖ్యమంత్రి ఆళ్లనాని అన్నారు. రాష్ట్రంలో కేసులు తక్కువ చేసి చూపుతున్నామంటూ ఆయన మాట్లాడటం అవగాహన రాహిత్యమని మంత్రి ఎద్దేవా చేశారు. లాబ్స్కు వెళ్తున్న టెస్టులను దాచటం ఎలా సాధ్యమో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు లేదా, ఆయన తనయుడు లోకేష్ కానీ క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లి విమర్శలు చేస్తే బాగుండేదని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలనే విపక్ష నేత తన లేఖల్లో ప్రస్తావిస్తున్నారని ఆళ్లనాని ఆరోపించారు.
'ప్రతిపక్ష నేత ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారు'
రాష్ట్రంలో కేసులు తక్కువ చేసి చూపుతున్నారంటూ ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలు సరికావని మంత్రి ఆళ్లనాని అన్నారు. ప్రతిపక్ష నేత ప్రజలను భయాందోళనలకు గురయ్యేలా మాట్లాడుతున్నారని విమర్శించారు.