ETV Bharat / city

హైదరాబాద్ మేయర్​ ఎన్నికలో కీలకంగా పతంగి... అసలు వ్యూహమేంటి? - ghmc mayor election updates

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో మజ్లిస్ పార్టీ పాత్ర కీలకంగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించకపోవటం వల్ల..కాసేపట్లో జరిగే ఎన్నికపై మజ్లిస్ పార్టీ ఏవిధంగా వ్యవహరించనుంది...? అన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎంఐఎం పార్టీ తమ కార్పొరేటర్లతో దారుస్సలాంలో సమావేశం కానుంది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఓ నిర్ణయానికి రానుంది.

mim
mim
author img

By

Published : Feb 11, 2021, 10:20 AM IST

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ సంఖ్యా బలం 54 వరకు ఉంది. ఇందులో కార్పొరేటర్లు 44 మంది, ఎక్స్ అఫిసియో సభ్యులు 10 మంది ఉన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకీ సంపూర్ణ మద్దతు రాకపోవడం వల్ల ఎంఐఎం పాత్ర కీలకంగా మారింది. ఎంఐఎం పార్టీ ఎలాగు భాజపాకు మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదు. అటు తెరాసకు ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వలేదు.. అలాగని వ్యతిరేకంగా ఓటు కూడా వేయలేదు. ఈ నేపథ్యంలో వీలైతే... జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలని ఎంఐఎం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఏం చేస్తారో...?

మేయర్ ఎన్నికకు ముందుగా జరుగనున్న కార్పొరేటర్ల ప్రమాణ స్వీకరణకు హాజరై... అనంతరం మేయర్ ఎన్నిక కోసం జరిగే ప్రత్యేక సమావేశం నుంచి నేరుగా వైదొలగాలా...? లేక ప్రత్యేక సమావేశానికి గైర్హాజరు కావాలా...? అనే అంశంపై ఎంఐఎం పార్టీలో చర్చ జరుగుతోంది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో అవలంభించే వ్యూహంపై...దారుస్సలాంలో జరిగే కార్పొరేటర్ల ప్రత్యేక సమావేశంలోనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పష్టత ఇస్తారని ఆ పార్టీ కార్పొరేటర్లు తెలిపారు.

సమావేశంలోనే నిర్ణయం...

పార్టీ కార్యక్రమాలపై వివిధ ప్రాంతాలకు వెళ్లిన కార్పొరేటర్లు అందరూ హైదరాబాద్​కు చేరుకున్నారు. అందరినీ దారుస్సలాంలో జరిగే సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఎంఐఎం నుంచి ఆదేశాలు వచ్చాయి. అక్కడ జరిగే సమావేశం అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: పల్లెపోరు: తొలివిడతలో కొన్ని చోట్ల ఆలస్యంగా ఫలితాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.